శ్రీకాకుళం: ఆమదాలవలస మండలంలో చెవ్వాకులపేట గ్రామానికి సమీపంలో అప్పట్లో కనకముడిపేట అనే గ్రామం ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి ఊరు పేరు మాత్రం అలానే ఉంది. అక్కడ ఎటువంటి గృహాలు లేవు. 1980లో వంశధార నదికి వచ్చిన వరద ప్రవాహానికి గ్రామం నీట మునిగిపోవడంతో గ్రామస్థులంతా ఖాళీ చేసి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.