BDK: సింగరేణి సంస్థ “నీటి బిందువు – జలసింధువు” కార్యక్రమంలో భాగంగా 102 చెరువుల నిర్మాణానికి, పూడిక తొలగింపుకు పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టింది. ఇప్పటి వరకు 20 శాతం చెరువుల నిర్మాణం పూర్తి కాగా, ప్రతీ చెరువు కనీసం ఒక హెక్టారు వైశాల్యం కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.