TPT: పాకాలలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై DY. CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఐదుగురు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యా. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. తిరుమల దర్శనం చేసుకుని తిరుగు పయనమైన భక్తులు ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం’ అని పేర్కొన్నారు. అలాగే, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.