W.G: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కు కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపకుడు హరిరామ జోగయ్య లేఖ రాశారు. డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో కాపులకు EWS కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. 103 రాజ్యాంగ సవరణ ప్రకారం విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాపుల అభ్యున్నతికి తోడ్పడవల్సిందిగా ఆ వర్గం తరఫున కోరుతున్నానని పేర్కొన్నారు.