ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక జారీ చేసింది. రిమోట్ ప్రాంతాల నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు రావాలని కోరింది. ఇకపై ఇంటి నుంచి పనిచేయటం కుదరని స్పష్టం చేసింది. రిపోర్టు చేయని పక్షంలో కంపెనీని వీడేందుకు సిద్ధం కావాలని చెప్పినట్లు తెలుస్తోంది. AIపై అత్యధికంగా దృష్టి సారించిన నేపథ్యంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని కంపెనీ యోచిస్తోంది.