మేడ్చల్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కిందపడి గాయాలపాలైన ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న మంజూల (28) అనే అనాథ మహిళ ఓ భవనం మెట్లపై నుంచి తల తిరిగి కింద పడిపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6న మృతి చెందింది.