WGL: ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతుందన్నారు.యూనిఫాంల తయారీ ప్రక్రియ వేగవంతం చేయలని సూచించారు.