TPT: తిరుపతి రూరల్ మండలం పాతకాలవ గ్రామానికి టీడీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి తుడ మాజీ ఉద్యోగి అర్కాడు విశ్వనాథ్ రెడ్డి మరణించారు. విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక నాయకులతో కలిసి అర్కాడు విశ్వనాథ్ రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపారు.