NRML: ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన నిర్మల్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఓ గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.