SKLM: రణస్థలం మండలం జె.ఆర్.పురం ప్రభుత్వ బాలికల వసతి గృహం ఆవరణలో శనివారం రాత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుమార్తె నిఖిల హాజరయ్యారు. పద్మశ్రీ వన జీవి రామయ్య స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని వెల్లడించారు.