GNTR: జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు శనివారం హోంమంత్రి వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిసి పోలీస్ సిబ్బందికి సంబంధించి ఆరోగ్య భద్రత, ప్రమోషన్లు, ఆర్థిక అంశాల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. సివిల్ కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోట్ చేయడం, ఎస్సై పోస్టుల భర్తీతో పాటు, డ్యూటీలో ఉన్న సిబ్బందికి తగిన వసతులు కల్పించాలని కోరారు.