అనకాపల్లి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. స్వచ్ఛతే ఆరోగ్యానికి నాంది అన్నారు. ప్రతీ ఒక్కరూ ఇంట్లో, కార్యాలయాల్లో పరిశభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.