టీవీ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. అందరూ యాంకర్స్ లా కేవలం ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేయడమే కాదు.. ఏదైనా ఇష్యూ వచ్చినా.. తనకు నచ్చని విషయం జరిగినా.. ఆమె వెంటనే స్పందిస్తుంది. ఈ విషయంలో ఆమె అస్సలు వెనక్కి తగ్గదు. కాగా.. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అది విజయ్ దేవరకొండను ఉద్దేశించే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే…
విజయ్ దేవరకొండ .. అనసూయ భరద్వాజ్ మధ్య అర్జున్ రెడ్డి సినిమా విషయంలో ఓ వివాదం చెలరేగింది. ఆ వివాదం ఇప్పుడు మళ్లీ లైగర్ సినిమా విడుదల సమయంలో చర్చకు రావడం గమనార్హం.
లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ టాక్‌ను తెచ్చుకోలేకపోయింది. నెటిజన్స్ కొందరు సినిమాను సోషల్ మీడియా మాధ్యమలో నేరుగానే విమర్శిస్తున్నారు.
లైగర్ మూవీ విషయంలో ఇలాంటి రిజల్ట్‌ను ఎవరూ ఊహించలేదు. సినిమాను ట్రోల్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి ఇది అనుకోని షాక్ అనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ లైగర్ సినిమా పేరుని ప్రస్తావించకుండా ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ‘‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!! #NotHappyOnsomeonesSadness but #FaithRestored ’’ అని అనసూయ ట్వీట్ చేసింది.
ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. ఐదేళ్ల క్రితం సంగతి.. ఇంకా గుర్తుంచుకొని మరీ అనసూయ ట్వీట్ చేయడం అందరినీ షాకింగ్ గురి చేసింది. ఆ విషయం ఇంకా.. అనసూయ మర్చిపోలేదనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందులో కొందరు అనసూయకు సపోర్ట్ చేస్తుండగా.. కొందరు.. విజయ్ దేవర కొండకు మద్దతుగా నిలవడం గమనార్హం.