ATP: రాష్ట్రంలో తొలగించిన వికలాంగుల పింఛన్లు యధావిధిగా కొనసాగించాలని వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గుత్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఒక్క పింఛన్ మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లను తొలగించడం చాలా సిగ్గుచేటు అన్నారు.