ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ(Koratala siva)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). అయితే గత కొద్ది రోజులుగా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఉండదా.. ఉంటే ఇంకెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. అనే సందేహాలెన్నో అభిమానులను కలవరపెడుతోంది. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే పుకార్లు కూడా వినిపించాయి. తాజాగా మరోసారి అలాంటి వార్తలే హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఎన్టీఆర్ 30(ntr30) టీమ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
ఇన్ని రోజులు స్క్రిప్టు పై కసరత్తులు చేసిన కొరటాల.. అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మిగతా నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో ఉందట చిత్ర యూనిట్. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ 30 పీఆర్ టీమ్ కన్ఫామ్ చేసింది. డిఓపి రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో కలిసి కొరటాల శివ.. భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ పనులని వేగవంతం చేసినట్టు తెలిపారు.. అలాగే ఈ అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుందని క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 12వ తేదీన జరగనున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం. దాంతో తారక్ ఫ్యాన్స్ కాస్త ఖుషీ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ 30 హీరోయిన్ విషయంలో మాత్ర క్లారిటీ రావడం లేదు. కానీ రష్మిక మందన్న దాదాపుగా ఎన్టీఆర్ సరసన ఫిక్స్ అయిందని టాక్. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.