ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అయితే శాసనసభ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆయన నేడు విజయవాడలో జరుగుతున్న సమావేశానికి హాజరు కావడంతో ఇఫ్తార్ విందులో పాల్గొనలేకపోయారు. దీంతో వీడియో కాల్ ద్వారా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకంక్షలు చెప్పారు.