GNTR: నగరంలోని పలు ప్రమాద ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ప్రదేశాలను బుధవారం డీఎస్పీ రమేష్ పరిశీలించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వెస్ట్ ట్రాఫిక్ సీఐని, ఇతర పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, STOP బోర్డులు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలన్నారు.