CTR: చిత్తూరులో ఏప్రిల్ 6న నిర్వహించే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా మహాసభలకు హాజరుకావాలని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్‌ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అలాగే, కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.