కృష్ణా: ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఉయ్యూరు మున్సిపాలిటీ ఆశీలు పాట బుధవారం మరోసారి జంగమయ్య కైవసం చేసుకున్నారు. ఈ పాటలో ముగ్గురు పాటదారులు ఆరేపల్లి నాగరాజు, వీరంకి నాగేశ్వరరావు, జంపాన జంగమయ్య హోరాహోరీగా జరిగిన పాటలో రూ.16.72 లక్షలకు ఆశీలు వసూలు సొంతం చేసుకున్నారు. జంగమయ్య సంవత్సరం పాటు ఉయ్యూరు పట్టణంలో ఆశీలు వసూలు చేసుకోనున్నారు.