PLD: మాచవరం మండలం గోవిందాపురం కామేపల్లి శివారు బల్లకట్టు వేలంపాట ఏప్రిల్ 2వ తేదీన గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు మాచవరం ఎంపీడీవో వెంగళరావు బుధవారం తెలిపారు. ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు వేలంపాట గడువు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ముందుగా ధరావత్తు చెల్లించి సీల్డ్ కవర్లో టెండర్‌ను వేయాలని కోరారు.