నల్ల సముద్రంలో సురక్షిత నౌకాయానంపై రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన ఒప్పందాన్ని మాస్కో వక్రీకరిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరుతానని జెలెన్స్కీ తెలిపారు. తమకు ఆయుధాలు కూడా ఇవ్వాలని అడుగుతానని వ్యాఖ్యానించారు.