బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని.. పరిణీతి సహనటుడు, గాయకుడు హార్డీ సంధు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెకు విశ్శేస్ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఇటీవల వీరు ముంబయిలోని ఓ హోటల్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ఇంకొంత మంది అంటున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha)తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల పుకార్లు వచ్చాయి. వీరిద్దరు కొన్ని రోజుల క్రితం ఓ డిన్నర్ డేట్ లో కనిపించడంతో పెద్ద ఎత్తున వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. మరోవైపు తాజాగా పరిణీతి చోప్రా సహనటుడు, సింగర్ హార్డీ సంధు వారి సంబంధాన్ని ధృవీకరించారు. చివరికి ఇది జరిగినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు.
పరిణీతి ఓ మూవీ చిత్రీకరణ సమయంలో వివాహం గురించి చర్చించుకునేవారని హార్డీ సంధు అన్నారు. ఆ క్రమంలో తనకు సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని పరిణీతి చెప్పిందని కూడా అతను తెలిపాడు. దీంతోపాటు ఆమెను అభినందించినట్లు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. మరోవైపు అంతకు ముందు, ఎంపీ రాఘవ్ సహోద్యోగి సంజీవ్ అరోరా కూడా ఈ జంటను అభినందించారు. దీంతో వీరి పెళ్లి ఖాయమైనట్లు పలువురు కామెంట్లతోపాటు విశ్శేస్ కూడా చెబుతున్నారు. గత వారం పరిణీతి, రాఘవ్ కలిసి ముంబైలో ఓ డిన్నర్ డేట్లో కనిపించారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి భోజనానికి బయలుదేరారు. రాఘవ్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న పరిణీతిని రిసీవ్ చేసుకున్నట్లు కనిపించాడు.
మార్చి 28న AAP ఎంపీ సంజీవ్ అరోరా.. పరిణీతి, రాఘవ్ పుకార్లపై మొదట కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ట్విట్టర్లో వారిద్దరికీ సంజీవ్ మొదట శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరి సోలో చిత్రాలను పంచుకుంటూ @raghav_chadha, @ParineetiChopraకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఐక్యతతో ఉంటూ ప్రేమ, ఆనందంతో ఆశీర్వదించబడాలని ఆయన విశ్శేస్ తెలియజేశారు. అయితే ఈ అంశంపై పరిణితి, రాఘవ్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇప్పటికే వారి సన్నిహితులు వారికి అభినందనలు తెలియజేయడంతో నిజమేనని కొంత మంది అంటున్నారు. కానీ ఇంకొంత మంది మాత్రం నిజం కాదని చెబుతున్నారు. ఇక అసలు నిజం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.