AP: నేడు ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని సీఎం ఆహ్వానించనున్నారు. త్వరలో రాజధాని అమరావతి పనులను మోదీ పునఃప్రారంభించనున్నారు. ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ముహూర్తం ఖరారు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.