గుజరాత్ అహ్మదాబాద్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కేజీల బంగారు నగలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రూ.1.37 కోట్ల నగదును కూడా పట్టుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.