ATP: యాడికి అభివృద్ధి కోసం తాను చెడు అయినా పర్వాలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రిలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ‘యాడికిలో చెన్నకేశవస్వామి భూములు, డబ్బులు దోచేశారు. కుంటలు ఆక్రమించి పెద్ద భవనాలు నిర్మించారు. వాటిని ఖచ్చితంగా తొలగిస్తా. మహా అయితే రాజకీయంలో నన్ను ఓడిస్తారు. ఏమవుతుంది ఇంతకుముందు కూడా నన్ను ఓడించారు’ అని పేర్కొన్నారు.