»New Delhi 6 Killed As Mosquito Coil Turns Room Into Gas Chamber
ఘోరం: New Delhiలో ఆరుగురి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్
మస్కిట్ కాయిల్స్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు పీల్చడం వలన వాళ్లు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం (post-mortem) నివేదిక వస్తేనే కానీ వారి మరణం వెనుక రహాస్యం (Secret) తెలియనుంది.
దోమల (Mosquito) బెడద భరించలేక వాటి నివారణకు మస్కిటో కాయిల్స్ (Mosquito Coils) ఉంచారు. అయితే తెల్లవారుజాము లేచిచూసేసరికి ఆ కుటుంబమంతా మృత్యువాతపడింది. మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడిన గాలి పీల్చి ఏకంగా ఆరుగురు మృతి చెందడం నివ్వెరపరచింది. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాని నుంచి వెలువడిన వాయువు పీల్చడంతోనే ఈ ఘోరం జరిగింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో (New Delhi) చోటుచేసుకుంది.
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ (Shastri Park) ప్రాంతంలో ఓ ఇంట్లో ఆరుగురు నివసిస్తున్నారు. శుక్రవారం ఎంతకీ ఇంట్లో నుంచి బయటకు ఎవరూ రాలేదు. ఇంట్లో నుంచి పొగలు (Smoke) వస్తుండడంతో స్థానికులు పోలీసులకు (Delhi Police) సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఆరుగురు అచేతనంగా పడి ఉన్నారు. తలుపులు, కిటికీలు అన్ని మూసి వేసి ఉండడంతో దోమల పొగ గది మొత్తం వ్యాపించి ఉంది. దానివలనే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను జాగ్ ప్రవేశ్ చంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. కాగా పొగ ద్వారా 15 ఏళ్ల బాలిక, 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. 22 ఏళ్ల యువకుడు ఈ ఘటన నుంచి కోలుకున్నాడు.
ఈ సంఘటనపై స్థానిక డీసీపీ జాయ్ టిర్కీ (Joy Trikey) మాట్లాడుతూ.. ‘మృతుల వివరాలు ఇంకా తెలియలేదు. ఆరుగురు మృతి వెనుక ఎలాంటి కుట్ర లేదు. దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు. అయితే మస్కిట్ కాయిల్స్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విష వాయువు పీల్చడం వలన వాళ్లు మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం (post-mortem) నివేదిక వస్తేనే కానీ వారి మరణం వెనుక రహాస్యం (Secret) తెలియనుంది.
VIDEO | Six people, including a toddler, suffocated to death reportedly after an overturned mosquito coil sparked a blaze at a house in northeast Delhi's Shastri Park in the early hours of Friday. pic.twitter.com/GLOhneuQuC