పిల్లల్లో ప్రాణాంతకమైన రెటినోబ్లాస్టోమా కలవరపెడుతోంది. ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే ఈ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కంటిలో ఉన్నట్టుండి కణతులు రావడం, కన్ను నొప్పి పెట్టడం, వాపు రావడం, ఆకారంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెటినోబ్లాస్టోమా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను త్వరితగతిన గుర్తించడం, అవగాహన, చికిత్సలు అందించడంతో.. నివారించవచ్చు.