కోనసీమ: మండపేట పురపాలక సంఘం పరిధిలో ఆస్తి పన్నులు వసూలు కోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసినట్లు పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన వార్డుల్లో పర్యటించారు. కమిషనర్ మాట్లాడుతూ.. మార్చి 31 నాటికి పాత బకాయిలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నులు అన్నీ వసూలు చేస్తామన్నారు. వంద శాతం వసూళ్లు లక్ష్యంగా పనిచేస్తున్నమన్నారు.