NGKL: దేశ ప్రగతి యువతతోనే సాధ్యపడుతుందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ అన్నారు. నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంగళవారం నిర్వహించిన యువ ఉత్సవ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో యువత అభివృద్దే లక్ష్యంగా విక్షిత్ భారత్ కొనసాగుతుందన్నారు. యువత చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు.