W.G: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన రానున్నారు. మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెలీప్యాడ్, ఆడిటోరియం పరిశీలించారు.