VZM: గజపతినగరం మండలంలోని చిట్టయ్యవలస, పట్రవాడ గ్రామాల్లో జరుగుతున్న పంట సంజీవని పనులు పట్ల ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ కుమార్, అదనపు కమిషనర్ శివప్రసాద్‌లు సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో పీడీ శారదాదేవి, ఏపీడీ రమమణి, ఎంపీడీవో కళ్యాణి, ఏపీవో సీహెచ్ రామారావు పాల్గొన్నారు.