బాపట్ల: పట్టణంలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని పట్టణ ప్రణాళిక అధికారి మల్లికార్జున హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని బెస్తపాలెం వద్ద డ్రైనేజీ మీద ఆక్రమణలను మంగళవారం తొలగించారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించాలని మల్లికార్జున సూచించారు.