అనంతపురం: విధులకు సక్రమంగా హాజరు కానీ సచివాలయ సిబ్బందికి మంగళవారం మధ్యాహ్నం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గుత్తి మండలంలోని ఊబిచర్ల గ్రామంలో ఉన్న సచివాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విధులకు హాజరుకాని పలువురు సచివాలయ సిబ్బందికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు.