SRPT: జిల్లా కేంద్రంలో గల పాత మిర్చి యార్డులో అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శుక్రవారం కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.