NLG: దేవరకొండ శివారులోని గాజీ నగర్ రోడ్డు పక్కన ఉన్న గానుగగట్టు కొండపై పురాతన రామాలయాన్ని స్థానిక కాలనీవాసులు గుర్తించారు. దేవాలయంలో రాముడి,సీత, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని ధర్మకర్తలు సందర్శించి పునఃప్రారంభించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఆలయ చరిత్రను తెలపాలని, దేవాదాయ శాఖను సందర్శించాలని కోరుతున్నారు.