W.G: జిల్లాలోని పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాలకోడేరు మండలం గొల్లలకోడేరు ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. నిర్దిష్ట ప్రణాళికతో పాత పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని, దర్యాప్తులో వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు.