RR: శంషాబాద్ మండల్ పెద్ద షాపూర్ గ్రామంలోని ఓ హైస్కూల్ యాజమాన్యం మూడు రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ యువకులలో ఉత్తేజపరిచే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న యాజమాన్యంని అభినందించారు.