కృష్ణా: నూజివీడు పట్టణంలో ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు పేర్కొని ఉన్నాయి. పట్టణంలో పేరుకుపోయిన చెత్తకుప్పల వద్ద గురువారం ఆవులు, కుక్కలు ప్లాస్టిక్ వ్యర్ధాలను మేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి, చెత్త కుప్పలు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను తినడంతో మూగజీవాలకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయని వాపోయారు.