HYD: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతను కల్పిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ దీపా రెడ్డి అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను దోమల్ గూడ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజ్లో ఘనంగా నిర్వహించారు.