ముంబైలోనూ భాష వివాదం తలెత్తింది. ముంబైలో నివసించాలంటే మరాఠీ నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ RSS నేత సురేష్ భయ్యాజీ జోషీ వ్యాఖ్యానించారు. దీనిపై మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ తదితరులు మండిపడ్డారు. ముంబై భాష మరాఠీనేనని, ఇక్కడ నివసించేవారు ఆ భాష నేర్చుకోవాలని సీఎం దేవంద్ర ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు.