కృష్ణా: ఉయ్యూరు ఆర్.టీ.వో కార్యాలయంలో సర్వర్ మోరాయించింది. ఉదయం నుంచి స్లాట్ బుకింగ్ దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పడిగాపులు కాస్తూ.. గంటల తరబడి కార్యాలయం ముందు నిలబడి అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజలు అదికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.