ASR: ఉపాధి హామీ పథకంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగ ఉండే సిబ్బంది పై చర్యలు తప్పవని జిల్లా డ్వామా పీడీ విద్యా సాగర్ హెచ్చరించారు. ఎటపాక మండలంలో జరిగిన రూ.12కోట్ల పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక సభ జరిగింది. గ్రామాల్లో లేనివారి మస్టర్లు నమోదు, తప్పడు కొలతలు నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.