WNP: పట్టణంలోని 5వ వార్డులోని వైశ్యనాయక్ తండాలో జరుపుల తిరుపతినాయక్కు చెందిన గడ్డివాములు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు దగ్ధమైన గడ్డివాములను పరిశీలించారు. వారు మాట్లాడుతూ..అగ్నిప్రమాదంలో రూ. 80వేల ఆస్తి నష్టం జరిగిందని విచారణ జరిపి బాధితుని ఆదుకోవాలని ప్రభుత్వాన్నికోరారు. గట్టుయాదవ్, శ్రీధర్, రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ ఉన్నారు.