ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ జగ్గారావు పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ ఆర్.ప్రభాకర రావు జగ్గారావును శాలువాతో సన్మానించి, ఆయన సేవలను ప్రశంసించారు. 35 సంవత్సరాల సేవలో నిష్కలంకంగా విధులు నిర్వహించినట్లు తెలిపారు. కాగా, జగ్గారావు 2016లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందాడు.