సత్యసాయి: కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అంజేశారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు రాజశేఖర్ ఆహ్వానం మేరకు రథోత్సవంలో పాల్గొన్నట్లు శ్రీరామ్ తెలిపారు.