NRML: ఆర్జీయూకేటీ విద్యార్థి కే.వెంకటేష్ హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి నెట్ బాల్ క్రీడాపోటీలకు ఎంపికయ్యాడు. శుక్రవారం ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ జాతీయ స్థాయి పోటీలకు వెంకటేష్ ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో విద్యార్థి పాల్గొంటారని పేర్కొన్నారు.