కోనసీమ: అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల పట్టుకున్న అక్రమ మద్యాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం పోలీసులు ధ్వంసం చేశారు. 130 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3220 మద్యం సీసాలు, 859 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం మరియు తొమ్మిది కేసులలో పట్టుకున్న 56 లీటర్ల నాటు సారా పారబోసారు.