VZM: స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధించినట్లు ఎస్పీ వకుల్ జిందల్ గురువారం తెలిపారు. బూర్లిపేటకు చెందిన రిక్షా డ్రైవర్ ఈశ్వరరావు స్కూల్ పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్లి తీసుకువచ్చేవాడని, ఈ క్రమంలో ఏడేళ్ల బాలిక ఇంటికి రాకపోవడంతో అప్పటిలో తల్లి ఫిర్యాదు చేసిందన్నారు.