SKLM: విద్యార్థులంతా విజ్ఞాన శాస్త్ర రహస్యాలను ఛేదించడానికి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.సూర్యచంద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయంప్రతిపత్తి)లో సైన్స్ డే నిర్వహించారు. శాశ్వత పరిష్కారాలు కనుగొనే దిశగా సైన్స్ పరిశోధనలు కొనసాగాలని వెల్లడించారు.