ప్రకాశం: మార్చి ఒకటో తేదీ నుంచి నూతన కేంద్ర మోటార్ వాహన చట్టం అమలు అవుతుందని హనుమంతునిపాడు ఎస్సై మాధవరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం నుంచి నూతన చలానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకపోతే గతంలో రూ.135 ఉండగా కొత్త చట్టం ప్రకారం రూ.1000 అని, ఇలా అన్ని రకాల చలానాలు పెరిగాయని పేర్కొన్నారు. అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.